అఖిల ప్రియ కు షరతులతో కూడిన...

 బెయిల్ మంజూరు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

మాజీ మంత్రి అఖిల ప్రియ కు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సికింద్రాబాద్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. పది వేల రూపాయల పూచి   కత్తు కింద ఇద్దరిని షూ రిటీ కింద కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 17 రోజులుగా మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిల ప్రియ శనివారం విడుదల అవుతారు. భర్త భార్గవ్ రామ్, సోదరుడి ముందస్తు బెయిల్ లు రద్దు చేస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు అయిన విషయం తెలిసిందే. రేపు అనగా శనివారం నాడు అఖిల జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

భార్గవ్‌కు మాత్రం..

అఖిలకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు భార్గవ్ రామ్‌కు మాత్రం సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా.. ఈ కేసులో ఏ-3 గా భార్గవ్ రామ్‌ ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో ముందోస్తు బెయిల్ ఇవ్వదని పోలుసులు చెబుతున్నారు. బోయినపల్లిలో ప్రవీణ్ సోదారులను కిడ్నాప్ చేసిన తరువాత భార్గవ్ రామ్ స్వయంగా కారు నడుపుతూ ప్రవీణ్ రావు, అతని సోదరులను ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లాడని.. ఆయన్ను విచారిస్తే మరికొంత సమాచారం బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు.

 ✍️-రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్. హైదరాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: