ఫణికుమార్ అద్దేపల్లి

ట్రావెలింగ్ సోల్జర్

మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్  రిలీజ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం  'ట్రావెలింగ్  సోల్జర్'. వినాయక మూవీస్ పతాకంపై అంగముత్తు రాజా నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతనిస్తూ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.  "లక్ష్మీస్ ఎన్టీఆర్"లో బాలకృష్ణ క్యారెక్టర్ ప్లే చేసిన బాలు హీరోగా పరిచయం అవుతున్నాడు.


     70 శాతం షూటింగ్ గోవా, చిక్ మంగళూర్, తలకోనలో  జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్  లడఖ్, మాల్దీవ్స్ లో జరగనుంది.  ఈ చిత్రానికి కెమెరా: నరేన్, మాటలు: చిట్టి రాజు, కో-డైరెక్టర్: ప్రణీత్, సంగీతం: జితేంద్ర, కాస్ట్యూమ్స్: సరస్వతి అద్దేపల్లి, నిర్మాత: అంగముత్తు రాజా,  కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఫణికుమార్ అద్దేపల్లి!!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: