గురుధేవోభవ...

బండి రాజుల శంకర్ ఆచార్యను..

సన్మానించిన బీజేవైఎం నేత ఎ.భాను ప్రకాష్

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

గరుధేవోభావ అన్నారు మన పెద్దలు. నూతన సంవత్సరాన్ని పురషకరించుకొని తనకు విద్యాబుద్దులు నేర్పిన గురువును సన్మానించిన బీజేవైఎం నేత ఏ.భాను ప్రకాష్ ఆయనుంచి ఆశీర్వాదం తీసుకొన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఎ.భాను ప్రకాష్ శనివారంనాడు  శ్రీ రామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్యులు బండి రాజుల శంకర్ ఆచార్యని కలిసి ఆయన్ని సన్మానించారు.  శ్రీ రామకృష్ణ విద్యాలయం లో ఏ.భాను ప్రకాష్ విద్యాభ్యాసం పూర్తిచేశారు.
ఈ సందర్భంగా భాను ప్రకాష్ తన గురువు బండి రాజుల శంకర్ ఆచార్యని సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ సందర్భంగా శంకర్ ఆచార్య మాట్లాడుతూ మా దగ్గర చదువుకున్న విద్యార్థి ఇప్పుడు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు అయినందున మాకు చాలా గర్వకారణం గా ఉంది అన్నారు. మునుముందు ఇలాంటి బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవ చేస్తూ హోదా కరమైన బాధ్యత లో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఐదవ వార్డు కౌన్సిలర్ సంగు భూపతి బీజేవైఎం పట్టణ అధ్యక్షులు  ఆనంద్, ప్రధాన కార్యదర్శి భోగ శివకుమార్, ఎలగందుల శ్రీకాంత్, కవతార సాయి, సముద్రాల వివేక్ చింతకింది వెంకటేష్, సామల వినీత్, నరేందర్, చింతకింది వినయ్,  బీజేవైఎం కార్య సభ్యులు హాజరయ్యారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: