ఉర్దూ అకాడమీ చైర్మన్ డా. ఎస్.ఎం.డీ. నౌమాన్ చేతుల మీదుగా 

ఏపీ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ జిల్లా క్యాలండర్ ఆవిష్కరణ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఉర్దూ అకాడమీ చైర్మన్ డా.ఎస్.ఎం.డీ. నౌమాన్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ జిల్లా క్యాలెండరు నంద్యాలలోని వారి ఆఫీస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. ఎస్.ఎం.డీ. నౌమాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉర్దూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటకు, ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి, మైనారిటీ ఉర్దూ విద్యార్థులకు గుణాత్మకం గా విద్య అందించేందుకు ఆపుట నాయకుల కృషి హర్షనియమన్నారు. త్వరలో జరగనున్న బ్యాక్లాగ్ డిఎస్సి లో రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉర్దూ మాధ్యమం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తమ వంతు కృషి చేస్తానని డా. smd. నౌమాన్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 2017 లో కొత్తగా అప్ గ్రేడ్ ఆయిన ఉర్దూ పాఠశాలలో ఉర్దూ మాధ్యమం లోని ఉపాధ్యాయులను  నియమించాలని, దీనికి విరుద్ధంగా నెల్లూరు జిల్లా లో ఫిజికల్ సైన్స్ తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులకు ప్రమోషన్ ద్వారా నియమించటకు చర్యలు తీసుకోవడం సబబు కాదన్నారు. రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలను పటిష్ట పరచుటకు, ఉర్దూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటకు త్వరలో నంద్యాల లోనే 13 జిల్లాలో ఉన్న అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని  ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు తేదీలను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాఠశాలల ఉర్దూ సూపర్ వైజర్ నౌమాన్ బాష, అసోసియేషన్ జిల్లా, నంద్యాల డివిజన్ నాయకులు అంజద్ షరీఫ్, మహేఫుజ్, ఇబ్రహీం, ముఖతార్, హనీఫ్, నజీర్ అహ్మద్, జమాల్ బాష తదితరులు  పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: