తెలంగాణ హైకోర్టు సీ.జే.గా జస్టిస్ హిమాకోహ్లి ప్రమాణం
హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి
హాజరైన ప్రముఖులు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
జస్టిస్ హిమాకోహ్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో జస్టిస్ హిమాకోహ్లితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, పరిమిత సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం పలికి పుష్పగుచ్చం సమర్పించారు. అనంతరం ఆమె నేరుగా హైకోర్టుకు చేరుకునిఅనంతరం సంతకం చేసి భాద్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు సీజేగా ఉన్న జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ బదిలీపై ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో పదోన్నతిపై జస్టిస్ హిమా కోహ్లి బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం మేరకు నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టీస్ గా నేటినుంచి పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన హిమాకోహ్లి పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా సీజేగా నియమితులయ్యారు. ఇదిలావుంటే జస్టిస్ హిమాకోహ్లి మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు.
రిపోర్టింగ్--డి.అనంత రఘు
న్యాయవాది
Post A Comment:
0 comments: