పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ అభ్యర్థులను ఎన్నుకోండి

ప్రజలకు రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

 నిరంతరం సేవా దృక్పథంతో పనిచేస్తూ,మరోవైపు గ్రామ స్వరాజ్య అభివృద్ధి కోసం పాటుపడే ఉత్తమ అభ్యర్థులను పంచాయతీ ఎన్నికల్లో ఎన్నుకోవాలని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బుధవారం ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాంధీజీ కన్న కళలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారని, అందుకు అనుగుణంగా కులమతాలకు, వర్గాలకు, ధన రాజకీయాలకు అతీతంగా వార్డు సభ్యులను,సర్పంచ్ లను సాధ్యమైనంతవరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

వార్డు సభ్యులు, పంచాయతీ సర్పంచ్ ల ఎన్నికలు ఏకగ్రీవాలను ప్రోత్సాహించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గతంలో వున్న దానికన్న నగదు ప్రోత్సాహకాలు పెంచడం జరిగిందని అన్నారు.  2 వేల జనాభా ఉన్న పంచాయతీలకు  రూ 5 లక్షలు, 2వేలకు పైగా 5 వేల లోపు జనాభా వుంటే రూ 10 లక్షలు, 5 వేల నుండి 10 వేల లోపు జనాభా వుంటే రూ 15 లక్షలు, 10 వేలకు మించి జనాభా వున్న పంచాయతీ లు ఏకగ్రీవమైతే ఆ పంచాయతీ లకు రూ 20 లక్షలు నగదు ప్రోత్సాహకం అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 19 మాసాల కాలంలో  చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఫలితంగా 90 శాతం పంచాయతీలు వైసీపీ మద్దతుదారులే చేజిక్కించుకొనున్నారని ఆయన భరోసా ఇచ్చారు. కావున ఈ ఎన్నికల్లో ఎటు గెలవలేమనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ ఎదో ఒక విధంగా తమ ఉనికిని కాపాడుకొనేందుకు డబ్బు,మద్యం వేదజల్లడమేగాక ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుందని, కావున ఆ కుట్రలను ఛేదించే విధంగా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ప్రజలకు హెచ్చరిక చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: