సంక్రాంతి సంబరాలు...

నిర్వహించిన స్టార్‌మా

జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 10కు కమ్యూనిటీలలో స్టార్‌ మా నిర్వహించిన వేడుకలలో 2500మందికి పైగా మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు

2021 సంవత్సరారంభంలో వచ్చిన  వ్యవసాయ పండుగను పూర్తి సంప్రదాయబద్ధంగా  వేడుక చేసిన స్టార్‌ మా


నూతన ఆశయాలు... సరికొత్త ఆశలతో వచ్చిన 2021 సంవత్సరాన్ని స్వాగతిస్తూనే ఈ సంవత్సరపు తొలి పెద్ద పండుగ సంక్రాంతిని తమ ప్రేక్షక కుటుంబంతో ఘనంగా వేడుక చేసింది  స్టార్‌మా. ఈ వేడుకలను మరింత ఆనందోత్సాహాలతో జరుపుకోవడానికి  హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 10కు పైగా కమ్యూనిటీలలో సాంస్కృతిక  వేడుకలను నిర్వహించడం ద్వారా సంక్రాంతి శోభను ప్రతి ఇంటికీ తీసుకువచ్చింది.

నగరవ్యాప్తంగా 10 కమ్యూనిటీలలో నిర్వహించిన ఈ వేడుకలలో స్టార్‌ మా వినూత్నమైన రీతిలో వేడుకలను నిర్వహించింది. సంక్రాంతి పండుగ ఆరంభానికి సూచికగా ఈ వేడుకలను నిర్వహించారు.  రంగోలితో భూమాతకు రంగవల్లులను మహిళలద్దారు. ఆకాశంలోని నక్షత్రాలను నేలపైకి తీసుకువచ్చి వీరు వేసిన రంగవల్లులు సంప్రదాయాల పట్ల నవతరానికి ఆసక్తినీ కలిగించాయి. సమకాలీనతను ఈ వేడుకలకు తీసుకువస్తూ సంప్రదాయ వస్త్రధారణతో చిన్నారులకు ఫ్యాషన్‌ షో నిర్వహించారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ వేడుకలలో భాగం కావడంతో ఆనందోత్సాహాలతో వేడుకల ప్రాంగణాలు కళకళలాడాయి.

ప్రత్యేక ఆకర్షణగా, రుద్రమదేవి ఇక్కడ కనువిందు చేశారు. ఈ వేడుకల వద్ద ఏర్పాటుచేసిన రుద్రమదేవి ఫోటో బూత్‌ వద్ద చిన్నారులతో పాటుగా పెద్దలు కూడా చేరడంతో పాటుగా వీరనారి రుద్రమతో సెల్ఫీలను తీసుకున్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: