ఆ చట్టాలను రద్దచేయాలి

సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా...నేతల అరెస్ట్

విడుదల కోసం పోలీస్ స్టేషన్ ముందు నేతల నిరసన

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

     రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను కుందిపు రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హమాలీ, అసంఘటిత కార్మికులకు వర్తింప చేయాలని కోరుతూ సిఐటియూ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్డీఓ కార్యాలయం ముట్టడి చేయటం జరిగింది. RDO కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో తోపులాట చోటుచేసుకుంది. నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ  సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం నుండి ర్యాలీ గా వెళ్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా అరెస్ట్ చేసిన నాయకులు విడుదల చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియూ పశ్చిమ ప్రకాశంజిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు డి.కె.ఎం.రఫీ, ఎం. రమేష్ మాట్లాడుతూ  వ్యవసాయన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేస్తే నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమస్య ల పై పోరాడుతున్న వారిని పై అప్రజాస్వామికంగా, అన్నం పెట్టే రైతన్న పై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.  రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ల జేబులు నింపే చట్టాలను రద్దు చేయాలని, రైతులతో చర్చల పేరుతో  కాలయాపన చేయకుండా  రైతు అడిగినా న్యాయమైన డిమాండ్లను  రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం కార్మిక చట్టాలను కుదిస్తూ యజమానులకు అనుకూలంగా చట్టాలను చేయడాన్ని, పని గంటలు 8 నుండి 12  గంటల పెంచే విధానాన్ని వారు వ్యతిరేకించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులందరికీ వర్తింప చేయాలి వారు డిమాండ్ చేశారు. రైతు చేసే న్యాయమైన పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర, బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పీ.వీ.శేషయ్య, టి.రంగారావు, గుమ్మ బాల నాగయ్య, ఎ.ఆవులయ్య, రాఘవమ్మ, ఆర్ మాలకొండయ్య, సిహెచ్ అంజయ్య, కొండారెడ్డి, నర్సింహా రెడ్డి, కే సుబ్బరాయుడు, ఎస్ కె ఖాదర్ భాష, జి పి తిరుమలయ్య రైతు సంఘం పచ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి గాలి వెంకట్రాంరెడ్డి నాయకులు  గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వై పాపిరెడ్డి, కెవిపిఎస్ నాయకులు జవాజి రాజు,  తదితరులు పాల్గొన్నారు.

 

అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని పోలిస్ స్టేషన్ ముందు ధర్నా

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: