ఆ చట్టాలను రద్దు చేయండి

బోగిమంటల్లో జీవో కాపీల దగ్ధం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజా వ్యతిరేక చట్టాల జీవో కాపీలను బోగి మంటల్లో రైతు సంఘం నేతలు తగలబెట్టారు. తర్లుపాడు మండలంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలని రైతులకు అన్ని రాష్ట్రాలలో  1. మోటార్లకు వ్యవసాయ మీటర్ల విధానాన్ని, అదే రకంగా దేశం కార్పొరేట్ కంపెనీలకు దాసోహం కాకుండా కంపెనీ వ్యవసాయం రద్దు. 2. పంటలకు గ్యారెంటీ రేటు కల్పించాలని స్వామినాథన్ సిఫారసు అమలు చేయాలని3. రైతు రుణ విమోచన చట్టం అమలు.
4. రైతుల పంటలకు ఇన్సూరెన్స్ కల్పించాలని నిరసనగా ఈరోజు ఉదయం భోగి మంటలలో వారి నల్ల చట్టాలు రద్దు చేయాలనికాల్చడం జరిగినది. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండలం రైతు సంఘం కార్యదర్శి ఏరువా. పాపిరెడ్డి ఈ చట్టాలు రద్దు అయ్యే వరకు ఈ నిరసన కార్యక్రమం జరుపుతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన లో కనిగిరి. శ్రీనివాస రెడ్డి తపనం.నారాయణరెడ్డి వెన్న. గాలి రెడ్డి కుందూరు. శ్రీనివాసరెడ్డి బాల బ్రహ్మం, కుందూరు. కాశిరెడ్డి వెన్న. బ్రహ్మానంద రెడ్డి ఏరువా. వెంకటేశ్వర్ రెడ్డి పి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: