జర్నలిస్టు పై దాడి హేయనియం

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జూకంటి అనిల్ 

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

సమాజానికి నాలుగవ స్దంభంలా పనిచేస్తూ 24/7 విధులను నిర్వహించేది జర్నలిస్టులని ఆలేరు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జూకంటి అనిల్ అన్నారు. జర్నలిస్టు సిద్దులు పై  బుదవారం జరిగిన దాడిని ఖండిస్తూ ఆలేరు ఎలక్ట్రానిక్ మీడియా,ప్రింట్ మీడియా  అసోసియేషన్ తరపున దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆలేరు ఎస్ ఐ రమేష్ కు వినతిపత్రం అందజేసినారు. ఈసంధర్భంగా అధ్యక్షులు జూకంటి అనిల్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. బుదవారం సాయంత్రం సహచర జర్నలిస్టు సిద్దులు పై మదర్ డెయిరీలొ విధులు నిర్వహిస్తున్న ఆలేటి అనిల్ అకారణంగా దూషించి దాడి చేయడం అమానుష చర్య అని ఈఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తూ నిరంతరం ప్రజాసమస్యలను పాలకుల దృష్టి కి తీసుకెళ్లే జర్నలిస్టులను నీసంగతి చూస్తా అని చంపుతానని అనడాన్ని తప్పుపడుతున్నామని చెప్పారు.తక్షణమే దాడి చేసిన ఆలేటి అనిల్ పై చర్యలు తీసుకొని ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో ఆలేరు‌ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులు జూల.శ్రీధర్ కె.ఉమాశంకర్,దడిగే రమేష్,ఎమ్.శ్రీనివాస్ శిగ స్వామి,గుండ్లపల్లి సత్యం, పందిరి రమేష్ వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పూజారి కుమార్ సిరిగిరి స్వామి కొరుటూరి ఉపేందర్ బోడ శ్రీకాంత్ కూళ్ల సిద్దులు బోడ నరేష్ ఆలేరు న్యూస్ రవి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: