వకీల్లకు వాక్సిన్ ఇవ్వాలి

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్ విన్నపం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో ఎంపి., ఎమ్మెల్యేల పై నమోదైన కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు కు సీనియర్ న్యాయ వాదులు హాజరవుతున్న నేపథ్యంలో వారందరికీ వాక్సిన్ టీకాలు వేయించాలి అని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యేక కోర్టు కు అన్ని జిల్లా కేంద్రాలకు చెందిన ఎం.పి., ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలపై కూడా పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కాగా అధిక సంఖ్యలో నిందితులు హాజరు అవుతోన్న నేపథ్యంలో ముందుగా న్యాయ వాదులకు వాక్సిన్ వేయాలని అన్నారు. కేసులను వాదించేందుకు న్యాయ వాదులు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కరోనా ప్రభావానికి గురి కాకుండా వాక్సిన్ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణం కక్షిదారులతో నిండి పోవడంతో ముందు జాగ్రత్తగా న్యాయ వాదులకు వాక్సిన్ టీకాలు ఇప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అని బార్ అసోసియేషన్ తరఫున విన్నవించారు. ఆరోగ్య శాఖా మంత్రి వెంటనే స్పందించి న్యాయ వాదులకు వాక్సిన్ టీకాలు ఇప్పించేందుకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, తమవద్ద శానిటైజర్లు ఉండాలని సూచించారు. "" కరోనా ను తరిమి కొట్టి.,, కోర్టులను పరి శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి బాధ్యత గా గుర్తించాలని తెలిపారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది--హైదరాబాద్


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: