మార్కాపురంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్

వాహనదారుల పత్రాల తనిఖీలు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

సరైన పత్రాలు లేని వాహనాలతోపాటు, రోడ్డుపైకి డైవింగ్ నియమనిబంధనలతో సంబంధంలేకుండా నడిపే వాహనాల విషయంలో మార్కాపురం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మార్కాపురం పట్టణం  లోని ప్రజల అభ్యర్ధనలను పరిగణలో తీసుకొని డి.ఎస్.పి. సి.ఐ. ఆదేశాల మేరకు పట్టణ పోలీసు విభాగం వారు తమ సిబ్బందితో  కలసి కంభం సెంటర్, దోర్నాల సెంటర్, కోర్టు సెంటర్, రద్దీగా వున్న పలు సెంటర్లలలో  పట్టణ ఎస్సై కిషోర్ బాబు, ఎ.ఎసై. మునాఫ్ ఆధ్వర్యములో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.
ఈ తనిఖీల్లో భాగంగా పట్టణంలో ద్విచక్ర వాహనాలపై అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డు నియమాలు పాటించకుండ, లైసెన్సు లేకుండా అతివేగంతోను, అజాగ్రత్తతో నడుపుతున్న వారితో పాటు   మైనర్ బాలురులను గుర్తించి వారికి, వారి తల్లిదండ్రులకు  కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమములో పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు..ఏఎస్. ఐ. మునాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: