నిష్పక్షపాతంగా వార్తలు అందించాలి

నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

వార్త పత్రికా సంస్థ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఏ క్యాంప్ లోని మాంటిస్సోరి స్కూల్ లో జరిగాయి. ఈ పోటీలో పెద్ద సంఖ్యలో మహిళలు పిల్లలు పెద్దలు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీ లకు ముఖ్య అతిథులుగా భాగ్యమతి, నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం పాల్గొని ఈ పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను బహూకరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగను ముందుగానే జరుపు కున్నందుకు  ఆనందం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఈ కరోనా సమయం లో కూడా ఇంతమంది ప్రజలు పాల్గొని ఈ ముగ్గుల పోటీల ను విజయవంతం చేసిన వార్త పత్రిక కర్నూలు జిల్లా బ్యూరో రిపోర్టర్ బసవరాజు ను, ప్రకాష్ వారి సిబ్బంది అభినందించారు.  అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అలాగే  నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు అందజేయాలని ఆమె వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నేషనల్ ఉమెన్స్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం, జిల్లా జనరల్ సెక్రెటరీ మున్ని, మేరీ తోపాటు స్టూడెంట్ యూత్ జనరల్ సెక్రెటరీ దివ్య, కార్యకర్తలు సిమ్రాన్, అనిత పాల్గొన్నారు.




 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: