కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలి

సీపీఐ, జాసంఘాల ఆధ్వర్యంలో..

సూపర్ ఏ మిల్లు కార్మికుల న్యాయం కోసం రౌండ్ టేబుల్ సమావేశం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

సూపర్ ఏ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొవాలని సీపీఐ, ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూపురం పట్టణంలోని స్థానిక ధర్మపురం కమ్యూనిటీ హాలులో సీపీఐ తాలూకా అధ్యక్షుడు దాదాపీర్ అధ్యక్షతన కిరికెర లో ఉన్న సూపర్ ఏ మిల్లు లోని 701మంది కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని సీపీఐ,&ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు ఐక్యంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.
701మంది కార్మికుల బకాయిలు చెల్లించకుండా. అక్రమ లే ఆఫ్ ప్రకటించి.మిల్లు లో విధులు నిర్వహిస్తూ మరణించిన కార్మికుల కు రావలసిన బకాయిలు చెల్లించకుండా కాలాయాపన చేస్తూ కోవిడ్ సాకుతో 60సంవత్సరాలు గా హిందూపురం కార్మికుల కడుపు నింపుతున్న పరిశ్రమను ఏకంగా రియల్టర్లకు అమ్మి లేఔట్ చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్న కార్మిక యాజమాన్యం పై అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని న్యాయస్థానం లో కూడా కార్మికుల కు న్యాయం జరగాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ సూపర్ ఏ మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకు సంఘటితమై పోరాడుతామని కార్మిక యాజమాన్యాన్ని హెచ్చరించారు.

 


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజారెడ్డి ఏఐటీయూసీ వేమయ్య యాదవ్ సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్.వినోద్ కుమార్ సీపీఎం హిందూపురం ప్రాంతీయ కార్యదర్శి.బీఎస్పీ శ్రీరాములు.తెలుగు దేశం నాయకులు డీఈ.రమేష్.ఆర్సీపీ నాయకులు శ్రీనివాసులు.అంబేద్కర్ యువజన నాయకుడు నాగార్జున.ముఖ్తియార్.రాము.కృష్ణమూర్తి.గంగప్ప.ఏఐవై ఎఫ్ సుభానీ బాబా .తదితరులు పాల్గొన్నారు.






 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: