అంతా దైవ 'లీల' అంటున్న

హారర్ థ్రిల్లర్ 'లీల'

కథానాయకి స్నేహా గణేష్

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     రాయల్ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాల దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ఏ.ఎం.భాషా నిర్మించిన 'లీల' ధియేటర్స్ లో విడుదలకు ముందే 'ఊర్వశి ఓటిటి' ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. 

     ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన స్నేహా గణేష్... "లీల" చిత్రం తనకు మంచి గుర్తింపునిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. 'లీల'లో నటించే అవకాశం రావడం దైవలీల'గా పేర్కొంది. ఈ చిత్రంలో తాను హీరోయిన్ మాత్రమే కాదని... సినిమాలోనూ సినిమా హీరోయిన్ గా నటించడం భలే గమ్మత్తుగా అనిపించిందని చెప్పింది. ఈ చిత్రం ఈనెల 14న "ఊర్వశి ఓటిటి" ద్వారా విడుదల కానుంది.

    విజయ్, స్నేహ గిరీష్, సంధ్య  ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ దాసరి, ఎడిటింగ్: ఎం.ఎన్.ఆర్, సంగీతం: శ్రీమిత్ర, నిర్మాత: ఏ.ఎం.భాషా, రచన-దర్శకత్వం: బాల!!


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: