బహుజన ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకొని...

ఏపిలో బహుజన రాజ్యాధికారాన్ని తీసుకొద్దాం

ఆంధ్ర బహుజన ప్రజావేదిక నేత కె.అర్.హరిప్రసాద్ బహుజన్

(జానోజాగో వెబ్ న్యూస్-కదిరి ప్రతినిధి)

బహుజన ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకొని...ఏపిలో బహుజన రాజ్యాధికారాన్ని తీసుకొద్దామని ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర నాయకుడు కె.అర్.హరిప్రసాద్ బహుజన్ పిలుపునిచ్చారు. ఆదివారంనాడు అనంతపురం జిల్లా, కదిరి నందు  "ఆంధ్ర బహుజన ప్రజావేదిక"ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ 97వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి "కర్పూరి ఠాకూర్ అమర్ హై", "బహుజనుల ఐక్యత-వర్దిల్లాలి", "బహుజనుల రాజ్యాధికారం-సాధిస్తాం"అంటూ బిగ్గరగా నినాదాలు ఇచ్చి ఘనంగా జరుపుకోవడం జరిగినది. అనంతరం రాష్ట్ర నాయకుడు కె.అర్.హరిప్రసాద్ బహుజన్ మాట్లాడుతూ....
  బీహారులో ఫాసిస్టులను మించి దారుణంగా వ్యవహరించే భూస్వాముల ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొని బడుగుల పాలిట ఆశాజ్యోతిగా . బడుగుల సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు.కనుక ఇటువంటి బహుజన మాజీ ముఖ్యమంత్రుల ఆశయాలను, లక్ష్యాలను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో బహుజనుల రాజ్యాధికారం తీసుకొద్దాం. ఇందుకోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలైన బహుజనులు అందరూ మాతో కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము."జన నాయక్" కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకులు. ఠాకూర్ జననాయక్ గా ప్రసిద్ది చెందాడు. కర్పూరీ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అతి సామాన్యమైన, అత్యంత వెనకబడిన వర్గమైన మంగలి కుటుంబంలో 1924 జనవరి 24న,   బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలోని పితౌజియా గ్రామంలో రామ్‌దులారీ దేవీ, గోపాల్‌ ఠాకూర్‌ దంపతులకు జన్మించారు.  తన 15వ ఏట విద్యార్థిగా ఉండి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగించి, అరెస్టయి, 50 రూపాయలు జరిమానా చెల్లించి, ఒక రోజు జైలు జీవితం గడిపి చిన్ననాటి నుంచి ధైర్యం గల చైతన్యవంతుడని నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేస్తూ గ్రామీణ సమాజంలో ఉద్యమాలు చేసి గుర్తింపు పొందారు. చరిత్ర, సమాజశాస్త్రం, రాజనీతి శాస్త్రాలు అధ్యయనం చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ భావాలకు ప్రేరేపితుడై క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 24 నెలలు జైలులో గడిపారు. టాటా కంపెనీలో కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొని 28 రోజులు జైలు జీవితం గడిపారు. జెపి పిలుపు ''సంపూర్ణ విప్లవం'' సాధనకై ఉద్యమించారు.
స్వాతంత్య్రం వచ్చాక బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 1952లో జరిగాయి. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగిన ఎన్నికల్లో దేనిలోనూ ఆయన ఓడిపోలేదు. దేశప్రజల ఆకాంక్షలను తీర్చడానికి పాలకులు కృషిచేయాలని బలంగా వాదించారు. నెహ్రూ అభివృద్ధి నమూనా పనికిరాదని ఆయన విశ్లేషించారు. దేశంలో భూస్వాముల వద్ద పోగుపడిన లక్షలాది ఎకరాలు, ప్రభుత్వ ఆధీనంలోని కోట్లాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేయటం వల్లే ఆర్థిక, సామాజిక సమానత్వం సిద్ధిస్తుందని, తద్వారా దేశం వేగంగా పురోగమిస్తుందని భావించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటికి పాలకుల మార్పిడి మాత్రమే జరిగింది తప్ప విధానాల్లో ఎలాంటి మార్పులేదని చెప్పారు. 1960లో టాటా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం 28 రోజులు జైలుజీవితం గడిపారు. అప్పుడు కూడా ఆయన శాసనసభ సభ్యుడే అన్నది గమనించాలి. అహింసాయుత సామాజిక పరివర్తన కోసం సంపూర్ణ విప్లవం నినాదాన్ని జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపునిచ్చారు. జయప్రకాశ్‌ నారాయణ్‌కు సన్నిహితుడైన కర్పూరి ఠాకూర్‌ జనతా పార్టీలో క్రియాశీల నాయకుడిగా మారారు. 1970లో బిహార్‌ రాష్ట్రానికి మొదటి బ్రాహ్మణేతర ముఖ్యమంత్రి. బిహార్‌ రాజకీయాలను శాసిస్తున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీశకుమార్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌లకు గురువు. బి.పి.మండల్‌ కమిషన్‌ ఓబీసీ రిజర్వేషన్‌ సిఫారసు చేయకముందే 1978లోనే బిహార్‌లో ఓబీసీలకు, స్త్రీలకు రిజర్వేషన్‌ కల్పించారు. దేశవ్యాప్త ఓబీసీ, ఎంబీసీ ఉద్యమానికి ఆద్యుడు. సామాజిక అణచివేత, వివక్షల మధ్య కర్పూరి ఠాకూర్‌ చదువుకున్నారు. డిగ్రీ వరకు చదవుకున్న ఆయన జాతీయోద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. చదువు ముగిసిన తర్వాత ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ గ్రామీణులను చైతన్యం చేశారు. బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడి జైలుజీవితం గడిపారు. గాంధీ ఆలోచనలను ప్రచారం చేశారు. కానీ కులానికి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహం చేయాలని డా.అంబేద్కర్‌, లోహియాలు కోరినప్పుడు గాంధీ, కాంగ్రెస్‌ తప్పించుకున్న తీరు కర్పూరి ఠాకూర్‌ను ఆలోచింపచేసింది. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ, పౌర హక్కులు కావాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం జరుగుతున్న సమయంలో లండన్‌లోని రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో గాంధీ వైఖరితో కర్పూరి ఠాకూర్‌ నిరాశ చెందారు. గాంధీవల్ల మన సమాజంలో ఎలాంటి మార్పురాదని గ్రహించి లోహియా సామ్యవాద సిద్ధాంతం, అంబేద్కర్‌ కుల నిర్మూలన సిద్ధాంతంతో ప్రభావితుడయ్యారు. కాంగ్రెసుకూ గాంధీకీ దూరంగా జరిగి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడారు. రామ్‌మనోహర్‌ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టుపార్టీకి అధ్యక్షుడిగా చాలాకాలం సేవలందించారు. 1978లో దేశంలోనే మొదటిసారి బీహార్‌లో బిసిలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. బిసిల సామాజిక స్థితిగతుల్లో వ్యత్యాసాలు గుర్తించి బిసి వర్గీకరణ చేపట్టి అత్యంత వెనుకబడిన ఎంబిసిలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి రిజర్వేషన్ల దృక్పథానికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ఈ రిజర్వేషన్‌ పాలసీనే ’కర్పూరీ ఠాకూర్‌ ఫార్ములా’గా ప్రసిద్ధిగాంచింది. ఓబీసీల ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ కర్పూరి ఠాకూర్‌కు కొత్త రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి. ఓబీసీలతో పాటు ఎంబీసీలు కూడా అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని కోరుకున్నారు. మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ అనే కేటగిరీ కర్పూరి ఠాకూర్‌ వల్లే ఏర్పడింది. దళితులు, ఎంబీసీలు, ముస్లింల హితం కోసం ఆయన పనిచేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి బతికారు. సుదీర్ఘకాలం పాటు బీహార్‌ రాజకీయాలను, దేశ రాజకీయాలను ఆయన ప్రభావితం చేశారు. సమర్ధవంతుడైన పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా పేరొందారు. ఎన్నడూ అవినీతికి పాల్పడని వ్యక్తి ఆయన. 1988 ఫిబ్రవరి 17న అంతిమ శ్వాసవిడిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ఆర్.హరిప్రసాద్, జిల్లా కో-కన్వీనర్ కె.సాయిశీనా,కదిరి పట్టణ కన్వీనర్ కెజిఎన్. జిలాన్(వెల్డర్స్ యూనియన్ నాయకులు)కదిరి పట్టణ కో-కన్వీనర్లు డేరంగుల భాస్కర్, చారుపల్లి ఆంజనేయులు, వేంకటేశ్వరగౌడ్,కుటాగుళ్ల రామన్న, నరసింహులు,రామచంద్ర,చౌడప్ప,మంగలి నరసింహులు, కుల్లాయప్ప, రామచంద్రయాదవ్,ప్రసాద్, వెంకటరమణ, నారాయణ, వే, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: