టిడిపి తీర్థం పుచ్చుకున్న....
కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత దామోదర్ నాగ శేషులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కర్నూలు జిల్లా గడివేముల మండలానికి చెందిన దామోదర్ నాగశేషులు నంద్యాల పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గౌరు చరిత ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దామోదర్ నాగ శేషులు గతంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతో అంకితభావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారు. అయితే ప్రస్తుత తరుణంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలనే సంకల్పంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా దామోదర నాగశేషులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోయిందని, రాష్ట్రంలో ఉండే వైసీపీ ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలి అంటే నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా రావాలని, ప్రస్తుతం ప్రజలందరూ టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారని, ప్రజలకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీలో చేరానని, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేవిధంగా తన శాయశక్తులా కృషి చేస్తానని మండలంలో, జిల్లాలోని నాయకులను కలుపుకొని తెలుగుదేశం విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
Post A Comment:
0 comments: