రావయ్య ప్రశాంత్ కిషోరా...?

తిరుపతి ఉప ఎన్నికల ఎఫెక్ట్

రంగంలోకి రాజకీయ వ్యహకర్త

మళ్లీ ప్రశాంత్ కిషోర్ ను డంప్ చేసుకోనున్న వైసీపీ

ఆయన సేవలు అవసరమని వై.ఎస్.జగన్ యోచన...?

అన్ని పార్టీలకు తిరుపతి ఉప ఎన్నిక ప్రతిష్టత్మకం

ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీకి ఇది తొలి ఎన్నిక..?

ఈ ఎన్నికలు ప్రభుత్వానికి తొలి పరీక్ష కూడా

అందుకే ప్రశాంత్ కిషోర్ వైపు చూపు...?

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

గత ఎన్నికల్లో వైసీపీని గట్టెక్కించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ ఏపీకి రానున్నారా....? తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఈ పరిస్థితిని కల్పిస్తోందా...? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ కు మళ్లీ పనిపడినట్లే కన్పిస్తుంది. ఆయన సేవలను మరోసారి వినియోగించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక కారణంగానే ఏపీలో ఆలయాలపై వరస దాడులు జరుగుతున్నాయని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తున్నారని జగన్ అనుమానిస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు.


అందరికీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం

వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా వస్తున్న ఎన్నికలు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే సందర్భంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చేస్తున్న ప్రజా పోరాటాలకు కూడా ప్రజామోదం ఏ మేరకు ఉందో ఈ ఎన్నికలతోనే తేలుతుంది. ఈ నేపథ్యంలో అందరికి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికతో పాటు మరికొన్ని అంశాలపై ప్రశాంత్ కిషోర్ టీం సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్వే చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ సర్వే పనులను ప్రశాంత్ కిషోర్ టీం కు అప్పగించాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతుంది. తన రెండేళ్ల పాలనలో జనం తన ప్రభుత్వంపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు.

సంక్షేమ పథకాలపై….

అందుకే వివిధ సంక్షేమ పథకాలను పూర్తిగా మరో రెండు నెలల్లో గ్రౌండ్ చేస్తారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇక మంత్రుల పనితీరుపై కూడా జగన్ సర్వే చేయించదలచుకున్నారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో మంత్రుల పనితీరు కూడా ప్రశాంత్ కిషోర్ సర్వేలో ప్రధాన అంశంగా మారిందని చెబుతున్నారు.

ఇక 175 నియోజకవర్గాల్లో ఒకసారి సర్వే చేయించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకోవాలనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందు ముందు ఉండటంతో పార్టీ ఎక్కడ బలంగా ఉందీ? బలహీనంగా ఉందీ? అన్నది జగన్ తెలుసుకోనున్నారు. ఈ బాధ్యతలన్నీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారంటున్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: