ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ

పశు వైద్యాధికారి డాక్టర్ డి. విష్ణువర్ధన రెడ్డి వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

గొర్రెలు, మేకలలో సామూహిక నట్టల నివారణ కార్యక్రమములో భాగంగా తాడివారిపల్లి గ్రామములో ఉచితంగా నట్టల నివారణ మందులు తాపించడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ డి. విష్ణువర్ధన రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదిన నాగెళ్లముడుపు, 22వ తేదిన మంగళకుంట, 23న కొత్తూరు, నాతానం పల్లి గ్రామలలోని గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాపిస్తామన్నారు.

సంవత్సరములో ప్రతి మూడు నెలలకు ఒకసారి నట్టలు నిర్మూలన మందులు తాపించడం వలన జీవాలు ఆరోగ్యంగా, బలంగా వుండి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. జీవాలు త్వరగా ఎదకు వచ్చి పొర్లుతాయని అన్నారు. పిల్లలు అధిక బరువుతో పుడుతాయని, మాంసం దిగుబడి పెరుగుతుందని తెలిపారు. అలాగే జీవాలలో మరణాల శాతం కూడ తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమములో నాగెళ్లముడుపు పశుసంవర్దక సహాయకుడు బి.త్రినాద్ మరియు పశుపోషకులు పాల్గోన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: