జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ మంజూరు చేయాలి

జానోజాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి మారాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కు అక్రిడేషన్ కార్డులు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులకు అక్రిడేషన్లను మంజూరు చేయకుండా లేనిపోని కొర్రీలు పెడుతోందని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి జర్నలిస్టులకు పాత అక్రిడేషన్లు రెన్యూవల్ చేస్తూ తాజాగా కొత్త అక్రిడేషన్ల పేరుతో నానా కొర్రీలు పెడుతోందన్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించడం శోచనీయమన్నారు. అక్రిడేషన్ల కమిటీలో గతంలో మాధిరిగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తన మొండివైఖరి మార్చుకొని జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: