నూతన ట్రాక్టర్ షోరూమ్ ప్రారంభం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణ శివారులోని ఆటోనగర్ సమీపంలో కేటి ఆగ్రో ఏజన్సీస్ నూతనంగా ఏర్పాటుచేసిన యన్మార్ కంపెనీకి చెందిన ట్రాక్టర్ షోరూమ్ ను నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లతో పాటు పరికరాలు ఎంతో మేలన్నారు.  రైతులు వీటిని ఉపయోగించుకొని మెరుగైన దిగుబడులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు శివారెడ్డి, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: