మహమ్మద్ గౌసొద్దీన్ పదవీ విరమణ 

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

స్నేహానికి చిరునామా.. మానవతకు మారుపేరు.. వృత్తి ధర్మానికి కట్టుబడే మనస్తత్వం..  వెరసి మహమ్మద్ మొహినొద్దీన్ - సలీమా దంపతుల జీవితం. అలాంటి ఇంట్లో పురుడుపోసుకున్న ధన్యజీవి మహమ్మద్ గౌసొద్దీన్.  నాటి నల్లగొండ జిల్లా ఆలేరులో మొహినొద్ధీన్ అంటే తెలియని వారు ఉండరు. ఆలేరు ఎండిఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ  పై అధికారుల చేత ప్రశంసలందుకోడమేగాక, వారికి అన్ని విధాలా చేదోడు-వాదోడుగా ఉంటూ వారి హృదయాలను గెలుచుకున్నగొప్ప వ్యక్తి ఆయన.  అలాంటి మహానుభావుడి ఇంట్లో మహమ్మద్ గౌసొద్దీన్ తో పాటు,  మహమ్మద్ మునిరొద్ధీన్, మహమ్మద్ సిరాజ్ అనే కొడుకులు పుట్టారు.. ఇది గతం.  అంత గొప్ప వ్యక్తి ఇంట్లో జన్మించిన మహమ్మద్ గౌసొద్దీన్ (58) ఇటీవలే  పదవీ విరమణ చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా  గౌసొద్దీన్ విశేష పేరుప్రఖ్యాతులు సాధించారు. మొక్కవోని ధైర్యంతో.. తన తండ్రి నడిచిన బాటలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ.. నేనుసైతం విధుల్లో వృత్తి ధర్మానికి సమిధనొక్కటి అవుతానంటూ  అడుగులు ముందుకు వేశారు. అలా వేసిన ప్రతి అడుగు  గౌసొద్దీన్ జీవితానికి రహదారినే చూపింది. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ లో సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ  వృత్తి ధర్మానికే అంకితమైన వ్యక్తి గౌసొద్దీన్. ఆలేరు వర్క్ ఇన్స్పెక్టర్ గా,  అటు తర్వాత మోత్కూరు ఏఈగా, భువనగిరి  ఏఈగా వృత్తి ధర్మంలో భాగంగా  సమర్ధవంతమైన పాత్రని పోషించారు. 

అలాంటి సమయంలోనే ఖాదీ సెంటర్ కు డిప్ టేషన్ పై బదీలీ అయ్యారు. అక్కడ తన వృత్తి  ధర్మానికి కట్టుబడి విజయవంతంగా  పదవీ విరమణ  చేశారు. మహమ్మద్ గౌసొద్దీన్ ఉర్దూలో డిగ్రీ పట్టా పొందిన రజియా సుల్తానాను వివాహం చేసుకున్నారు. రజియాజిది భువనగిరి. వీరికి సోహెల్, జుబేర్, ఇంతియాజ్ అనే ముగ్గురు కొడుకులు. పెద్దోడు సోహెల్ సివిల్ ఇంజనీర్. రెండోవాడు  జుబేర్ ట్రిపుల్ ఐ.టి, మూడోవాడు ఇంతియాజ్ డిగ్రీ పట్టాపుచ్చుకున్నాక బిజినెస్ లో సెటిలయ్యాడు. ఇదీ మహమ్మద్ గౌసొద్దీన్ కుటుంబ నేపథ్యం..  మహమ్మద్ గౌసొద్దీన్ కు సంబంధించి ... ప్రాథమిక విద్య ఆలేరులోనే గడిచింది. ఇంటర్ మీడియట్ కోసం భువనగిరికి వెళ్ళక తప్పలేదు. ఉస్మానియా యూనివర్సీటీలో డిగ్రీ లో బిఏ పట్టాను పుచ్చుకున్న గౌసొద్దీన్ చిన్నప్పటినుంచే స్నేహానికి చిరునామా.. మానవతకు మారుపేరుగా నిలిచేవారు. చక్కటి హావభావాలతో మెలుగుతూ అందరికీ ఆదర్శప్రాయుడుగా అడుగులు ముందుకు వేశాడు. అందుకే   పదవీ విరమణ వరకూ అదే సంకల్పానికి.. వృత్తి ధర్మానికి కట్టుబడి విజయవంతమైన జీవనాన్ని సాగించారు. అదే.. గౌసొద్దీన్ గొప్పతనానికి నిదర్శనం. 

భయ్యాకు పదవీ విరమణ శుభాకాంక్షలు.. 

తన తండ్రి  మహమ్మద్ మొహినొద్దీన్ చూపిన బాటలో నడవడమే గాకుండా, అదే మార్గంలో మమ్మల్ని సైతం నడిపించి మా కుటుంబానికే పెద్దలా వ్యవహరించిన మా భయ్యా మహమ్మద్ గౌసొద్దీన్ కు ఈ సందర్బంగా  పదవీ విరమణ శుభాకాంక్షలు అందజేస్తున్నాను అన్నారు మహమ్మద్ సిరాజ్. ఓ ఇంటికి భయ్యా అంటే ఎలా ఉండాలి అన్న సంకేతాన్ని ఇచ్చిన వ్యక్తి మా భయ్యా అని సిరాజ్ పేర్కొంటూ.. మా భయ్యా జీవితం మరింత ఆనందంగా సాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: