ఎంపీడీవో నరసింహులు ఆధ్వర్యంలో...

జియో ట్యాగింగ్ పై అవగాహన 

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నీటి సరఫరా చేసే ట్యాంకర్ల యజమానులకు, పంచాయతీ కార్యదర్శులకు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఎంపీడీవో ఎస్. నరసింహులు ఆధ్వర్యంలో జియో ట్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.డబ్ల్యూ.ఎస్. డీఈ ఎల్లయ్య మాట్లాడుతూ మండలంలో నీటి సౌకర్యార్థం నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నీటిని సరఫరా చేసే ట్రాక్టర్ ఏజన్సిలకు జియో ట్యాగింగ్ తప్పనిసరిగా పాటించాలని ప్రతి ఒక్క ట్యాంకర్ తోలే వ్యక్తి నూతన యాప్ ను వినియోగిస్తూ ప్రతి ట్రిప్ కు ఆరు ఫోటోలు అప్లోడ్ చెయ్యాలని అన్నారు.

అదేవిధంగా మండలంలో    “ జల జీవన్ మిషన్ “పథకం కింద 32 పనులు వచ్చాయని ప్రతి ఇంటికి నీటి సౌకర్యం అందించాలనే సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంటు ఏర్పాటుతో 3.93 లక్షల నిధులు మంజూరయ్యాయని కనుక గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా మండలంలోని ప్రజలందరి ఇంటింటికి నీటి కొళాయి ఏర్పాటుచేసి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యూ.ఎస్.  ఏఈ సృజన జ్యోతి, ఈవోపీఆర్డీ అమరేశ్వర రావు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, నీటి సరఫరా చేసే ట్యాంకర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: