చిన్న పత్రికలకు నెల నెలా ప్రకటనలు ఇవ్వాలి 

ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కార్యాలయం ముందు చిన్న పత్రికల సంఘాల ధర్నా

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

 రాష్ట్ర వ్యాప్తంగా  చిన్న పత్రికలకు ప్రతి నెల నెలా ప్రకటనలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ చిన్న పత్రికల సంఘాల నాయకులు సమాచార శాఖ ఆఫీస్  లో  ఇంచార్జి  డైరెక్టర్ నాగయ్య ఛాంబర్  ముందు బైఠాయించి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఐ అండ్ పి ఆర్  డైరెక్టర్ నాగయ్య కాంబ్లే ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  నాగయ్య మాట్లాడుతూ
వారం రోజుల్లో కమిషనర్ గారితో  సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, తో పాటు వివిధ సంఘాల నాయకులు  అగస్టీన్, జానకిరామ్,  దయానంద్,  సెక్రటరీ బాలకృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ చాటింపు అశోక్,ఎండి రియాజ్, అజాం ఖాన్, జాన్ షాహీద్, ఇక్బాల్, ఉస్మాన్ రాసీద్, సమద్,      గగోళ్ళ రమేష్,    అక్తర్ హుస్సేన్,  రవి,  సుధీర్  కుమార్, నరసింహ, మసూద్,నవీన్ కుమార్, ఖాసీం,ఆఫ్రోజ్ ,అలీ,మహీమూద్, వెంకటయ్య,  ఎం.డి గౌస్, శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్, ఎండి సయ్యద్,   ఖుద్దూస్,  మొయినుద్దీన్, సయ్యద్  పాష,  రాజు, సందీప్, నజీమ్, యాదగిరి, ధర్మ నాయక్, యువరాజ్, సాజిదా, సికందర్, తదితరులు పాల్గొన్నారు.




 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: