వైసీపీ నిజమైన అభిమాని "తబ్రేజ్"

బాచం జగదీశ్వర రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలను క్యాలెండర్ రూపంలో ప్రజల ముంగిట చేరుస్తున్న ఏకైక కార్యకర్త తబ్రేజ్ అని వైసీపీ నాయకులు, మాజీ మండలాదక్షులు బాచం జగదీశ్వర రెడ్డి కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి స్వగృహంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఇసాక్ బాష, జగదీశ్వర రెడ్డిల చేతులమీదుగా  202వ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని, వైసీపీ 4వ వార్డు ఇంచార్జి తబ్రేజ్ రాష్ట్రంలో ఎవరు చేయలేని పని చేశారన్నారు.
వార్డులో ప్రజలందరికీ ముఖ్యమంత్రి చేపడుతున్న నవరత్నాలను అందరికి తెలిసేవిధంగా క్యాలెండర్ రూపొందించడం గర్వించతగ్గ విషయమని అన్నారు. కరోనా కష్ట కాలంలో తబ్రేజ్ మాతృమూర్తి మృతి చెందినా మొక్కవోని ధైర్యంతో ప్రజలకు సేవలు అందించారన్నారు. తబ్రేజ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదప్రజలకు చేస్తున్న పథకాలు అందరికి తెలియాలని చిన్న ప్రయత్నం చేసానని అన్నారు. అనంతరం పుర ప్రముఖులతో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ హబీబుల్లా, శ్యామ్ సుందర్ గుప్తా, దేశం సుధాకర్ రెడ్డి, గన్ని కరీం, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, మాధవరావు, పుల్లయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: