ఓటు వినియోగంతోనే మనం కలలు గన్న రాజ్యం

జానోజాగో...ముస్లిం హక్కుల పోరాట సమితి నేతల వెల్లడి

ఘనంగా ఓటు హక్కు దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

జాతీయ ఓటు హక్కు దినోత్సవం సందర్భంగా నంద్యాల లో ని నడిగడ్డ లో ఐదో వార్డులో ముస్లిం హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఓటు హక్కు దినోత్సవం జరిగినది ఈ కార్యక్రమంలో  ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ ఎం ది యూనుస్, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈ రోజు అంతర్జాతీయ ఓటు హక్కు దినోత్సవం ఒక పండుగలా జరపాలని పిలుపునిచ్చారు.
plz subscribe jaanojaagotv & share links
దేశంలోని యువతి యువకులు అందరూ 18 సంవత్సరాలు దాటిన వారందరూ ఓటర్లుగా వారి పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు. అలాగే భారత రత్న అంబేద్కర్ మహాత్మా గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని నీతి నిజాయితీగా పనిచేసే యువకులను ఎన్నుకోవాలని పిలుపును ఇచ్చారు. ఓటు ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఈ హక్కును మనం ఎప్పుడైతే వాడుకొంటామో అప్పుడు దేశ పురోగతికి తోడు పడినవారమవుతావని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోజు కూడా రాజకీయాల రావాలని పిలుపునిచ్చారు.  రాబోయే రోజుల్లో నంద్యాల పట్టణంలో వాడవాడలా తిరిగి ఓటు హక్కు పై ప్రజల్లో చైతన్యం పరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి నాయకుడు ఎస్ ఎన్ డి మహమ్మద్ కైఫ్, హుస్సేన్ ,షారుక్ ఖాన్, మహమ్మద్ హుస్సేన్, బబ్లు ఆరిఫ్ పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: