ఢిల్లీలో రైతు ఉద్యమాలకు బాసటగా...

ఏఐఎస్ఎఫ్..ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంఘీ భావ కార్యక్రమాలు


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

ఢిల్లీ నగరంలో సింగ్ బార్డర్లో రైతు నల్ల చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆంధ్ర ప్రదేశ్ నుండి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్ష,కార్యదర్శులు అఫ్సతాప్ అలాం ఖాన్, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి విక్కీ మహేసారి,ఆంధ్రప్రదేశ్ ఏఐవైఎఫ్-ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నక్కి.లెనిన్ బాబు,జి.రంగన్న, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి, ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ స్టాలిన్, ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా నాయకులు అమర్,నెల్లూరు జిల్లా నాయకులు అనిల్, ఏఐవైఎఫ్ కర్నూల్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్,ఎపి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు,విశాలాంధ్ర కర్నూల్ మేనేజర్ నాగరాజు ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజీవ్,మరియు ఆంద్రప్రదేశ్ నుండి ఎఐఎస్ఎఫ్-ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: