ఘనంగా గణతంత్ర దినోత్సవం

ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో  72వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్. చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యములో ఫ్లాగ్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిధిగా పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు గార్జునరెడ్డి మాట్లాడుతూ బీ.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయనీ చెప్పారు ,

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి


రాజ్యాంగంలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాట ఎంతో విలువ అయినదని దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అర్దం చేసుకోవాలని సూచించారు , నేటి బాలలే రేపటి పౌరులు అని కొనియాడారు ,ఈ కార్యక్రమం లో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి,  శ్రావణి హాస్పిటల్ చైర్మన్ చప్పలి కనకదుర్గ, మార్కాపురం గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్  ఎం. చంద్ర శేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర  సిబ్బంది, లయోలా స్కూల్స్ అధినేత చెంచిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

✍️రిపోర్టింగ్-షేక్ గౌస్ బాష

జానో-జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్ 

మార్కాపురం.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: