అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు మీ ముంగిటకే 

కులాలు మతాలు పార్టీలు చూడము

అందరినీ కలుపుకొని పొండి

ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయాలని,మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి అన్నారు. నవరత్నాలలో ప్రధానమైన పేదలకు ఇంటి స్థలం ఇంటి నిర్మాణం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని గానుగ పెంట గ్రామం నుండి తర్లుపాడు ఎంపీడీవో ఎస్ నరసింహులు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి.ఈ సందర్భంగా గానుగపెంట పంచాయతీలో - 63, కలుజువ్వలపాడు పంచాయతీలో - 173,రాగసముద్రం పంచాయతీలో - 37,మంగళకుంట పంచాయతీలో - 63 మంది లబ్దిదారులకు శనివారం మొత్తం 336 మంది లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.పట్టాల పంపిణీ కి వెళ్ళిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కి ప్రతి గ్రామంలో పూలవర్షంతో,మేళతాళాలతో,భారీ ర్యాలీలతో స్వాగతం పలికి గ్రామ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలం,ఇంటి నిర్మాణం కార్యక్రమంతో జగన్ వందకు వంద శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నారన్నారు.ఇచ్చిన హామీలను 18 నెలల్లో అతి తక్కువ సమయంలో వందకు వందశాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అని కొనియాడారు.ఈ ప్రభుత్వం మహిళల పక్షపాతి అని,ఇచ్చిన హామీలలో దాదాపుగా 75% మహిళల పేరు మీదనే అమలు చేశారన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడి అభివృద్ధి లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.పంట నష్టపోయిన రెండు నెలలలో పంట నష్టం డబ్బులు అందజేసిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనని అన్నారు.గతంలో ఏ ప్రభుత్వానికి ఇది సాధ్యం కాలేదని చెప్పారు.ఇల్లు నిర్మించుకోవడానికి మూడు పద్ధతులు ఉన్నాయని,వాటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని నిర్మించుకుని,ఆనందంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ నరసింహులు,తర్లుపాడు తాహసిల్దార్ పులి శైలేంద్ర కుమార్,హౌసింగ్ డిఇ పవన్ కుమార్, హౌసింగ్ ఏఈ విజయబాబు,ఎన్ఆర్ఇజిఎస్ ఏపీఓ మహాలక్ష్మి ,వెలుగు ఏపీఎం డి పిచ్చయ్య,సర్వేయర్ దర్బార్ మస్తాన్,అన్ని సచివాలయల సర్వేయర్లు,వీఆర్వోలు, తర్లుపాడు మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి,వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏక్కంటి రామిరెడ్డి,తాతిరెడ్డి మల్లారెడ్డి,మురారి వెంకటేశ్వర్లు,కొండారెడ్డి, శేషి రెడ్డి,భూపాల్ రెడ్డి,వెన్న సత్యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.








 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: