జంట హత్యల నేపథ్యంలో...

ఎవరాకిల్లర్ ...

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)                                                            

మజ్ను ఫిలింస్ పతాకంపై బల్వాన్ ( మాజీ మిస్టర్ ఆంధ్ర ), శ్రావణి హీరో హీరోయిన్లుగా షేక్ సంధానిబాషా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఎవరాకిల్లర్ ... చిత్రం ఈ నెల జనవరి 26న రిపబ్లిక్ డే సందర్బంగా డిజిటల్ ప్లాటుఫామ్స్ అయినా హంగామా, అమెజాన్ ,MXప్లేయర్, ఎయిర్టెల్ X ట్రీమ్ , వోడాఫోన్ లలో విడుదలవుతుంది. 

                                 ఈ సందర్భంగా దర్శక నిర్మాత షేక్ సంధానిబాషా మాట్లాడుతూ... జంట నగరాల్లో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఒక లేడీ ఇన్సెపెక్టర్ హీరోయిన్ ,ఆమెకు  సహకరించే ప్రవేట్ డిటెక్టీవ్ పాత్రలో హీరో తో కలిసి మర్డర్ మిస్టరీని ఎలా చెదిచారు ఇంతకీ ఎవరాకిల్లర్ ఆ కిల్లర్ని పట్టుకునే క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి అనే సస్పెన్స్ తో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా తెరకెక్కించాం, దీనికి స్వీక్వెల్ గా పార్ట్ 2 కూడా చేస్తున్నామని ఆర్టిస్టులు ,టెక్నిషన్ల వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.                                                                                             


       హీరో బల్వాన్ మాట్లాడుతూ... మాజీ మిస్టర్ ఆంధ్ర టైటిల్ సాధించిన నేను 47 చిత్రాలలో సోలో ఫైటర్ గా నటించాను ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.                                                                                        

     హీరోయిన్ శ్రావణి మాట్లాడుతూ... ఎన్నో టీవీ సీరియళ్ళలో నటిస్తున్న నన్ను ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.       

                           

       ఇంకా అన్నపూర్ణ , గౌతమ్ రాజు ,పావలా శామల, దిల్ రమేష్, జానీ భాష, మిమిక్రి  మూర్తి, శివ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న  ఈ చిత్రానికి కెమెరా : జి కె నాయుడు , కథ మాటలు : బల్వాన్ , సంగీతం : రాజేష్ రాజ్ , ఫైట్స్ : కె రాము , సహనిర్మాతలు : విజయశ్రీ , సన్నీ , స్క్రీన్ ప్లై , దర్శకత్వం ,నిర్మాత : షేక్ సంధాని భాషా.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: