గరీబోకి జాన్...అశా ఖాన్

ఖాలిదా పర్వీన్ పరిచయం అక్కరలేని పేరు. ఆకలితీర్చే అన్నపూర్ణ అని ఇటీవలె ఓ దిన పత్రిక ఆమె సేవలను కీర్తిస్తూ కథనాన్ని ప్రచురించింది. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ సేవాభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారామె. లాక్ డౌన్ లో , హైదరాబాద్ వరద బాధితులకు ఆమె అందించిన సేవలు అనిర్వచనీయం. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోనూ ఖాలిదా పర్వీన్ స్ఫూర్తితో ఓ యువతి సేవాభావంతో ముందుకెళుతున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన ఫుడ్ బ్యాంక్ ఆషా ఖాన్ అందరికీ తెలిసిన పేరు.  గత కొన్నేళ్లుగా సత్తుపల్లి పరిసరప్రాంతాల్లోని అన్నార్తుల ఆకలితీరుస్తున్నారామె. హిందూ, ముస్లిమ్, క్రైస్తవ పండుగలప్పుడు నిరుపేదలకు పండగ సంతోషాలను అందిస్తున్నారు. వృద్ధాశ్రమాలకు చేరుకుని కొత్తబట్టలు అందిస్తున్నారు. బాటసారులు, అనాథలు, వితంతువుల ఆకలి తీరుస్తున్నారు. కులమతాలకతీతంగా అందరి ఆకలి తీరుస్తున్న ఆషాఖాన్ సేవలకు మెచ్చుకుని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సన్మానించాయి. ‘నిరుపేదల ఆకలి తీర్చడంకంటే జీవితంలో సంతృప్తి ఇంకేముంటుంది. ఈ పనిలో పాలుపంచుకుంటున్న అందరికీ నా ధన్యవాదాలు’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారామె. 

✍️ రచయిత-ముహమ్మద్ ముజాహిద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: