వైఎస్సార్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మున్సిపల్ పరిధిలోని 28వార్డు నుండి 42వార్డు పరిధిలో ఉన్న2500 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి చేతులమీదుగా టిడ్కో గృహాల పట్టాలను పంపిణీ చేసి ఇంక ఎవరికైనా అర్హత ఉండి రాకపోతే వారు సచివాలయంలో కానీ వాలంటరీ ధ్వరా అప్లై చేసుకోవచ్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 28వార్డు నుండి 42వార్డులకు చెందిన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి లబ్ధిదారునికి అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని అందువల్లే ఈరోజు వైస్సార్ జగనన్న సొంతింటి కల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉచితంగా గృహాలను పంపిణీ చేస్తున్నామని,  కానీ ఇంకా కొంతమంది లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకు పోయి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు రావలసిన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకునిపోతమని అభివృద్ధి చేయడానికి ఎంత దూరమైన పోతామని  ప్రజలందరి సంతోషమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరోన సమయంలో ప్రజలు కష్టాలు పడుతుంటే తెలుగుదేశం నాయకులు మాత్రం వారి ఇళ్లలో కూర్చున్నారు

కానీ మేము ప్రతిరోజు ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించడం జరిగిందని, మళ్ళీ ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు స్థలాలు రాకుండా దుర్మర్గంగా వ్యవహరిస్తున్నారన్నారు, అందుకే ప్రజలు కుడా త్వరలో వస్తున్న మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని కనుమరుగులేకుండా చేయాలని 42 వార్డుల్లో  వైసీపీ జెండాను ఎగరవేయలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, మార్కెట్ యార్డు చైర్మన్ ఇషాక్ బాషా,మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన,బెస్త సంఘ డైరెక్టర్ చంద్ర శేఖర్,మాజీ వైసీపీ కౌన్సీలర్స్, వైసీపీ వార్డు ఇన్ఛార్జిలు,వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: