విశ్వవిద్యాలయాల్లో... 

రోహిత్ వేముల పేరుతో ప్రత్యేక చట్టాన్ని అమలు పరచాలి

పిడిఎస్ యు...పీవైఎల్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నందకొట్కూర్ ప్రతినిధి)

భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో రోహిత్ వేముల పేరుతో ప్రత్యేక చట్టాన్ని అమలు పరచాలని ప్రగతిశీల యువజన సంఘం, పీవైఎల్ ఆధ్వర్యంలో  రోహిత్ వేముల ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా నాయకులు యు నవీన్ కుమార్ మాట్లాడుతూ..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన నిందితులను ఇంతవరకు ఐదు సంవత్సరాలు గడిచిన శిక్ష వేయలేదని ప్రస్తుతం దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ, ఇతర ఉన్నత  విద్యా సంస్థల్లోనూ వ్యాపించిన  బ్రాహ్మణీయ, ముస్లీం వ్యతిరేక, అగ్రహార భావజాలం దళితుల్ని, ఆదివాసీల్ని, ముస్లీం విద్యార్థుల్ని తీవ్ర వివక్షకు గురిచేయడం, వారి మీద క్రూరమైన దాడుల్ని చేయడం జరుగుతోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో కాషాయీకరణ కొనసాగుతోంది. ఈ తరుణంలో యూనివర్సిటీ విద్యార్థుల పై దాడులు జరుగుతున్న కాషాయ మను వాదులను ప్రతిఘటిస్తూ కుల మత రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అసమానతలను నిర్మూలించేందుకు అందరు కలిసి రావాలన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: