నల్లమల ఆటవీప్రాంతంలో...

పులి చర్మాల స్మగ్లర్ల పట్టివేత

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లర్లను అదుపులోనికి తీసుకున్నట్లు డివిజినల్ ఫారెస్ట్ అధికారి (ఆత్మకూరు) తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్  డిఎఫ్ఓ కుమార్, ఇంటలిజెన్స్ ఇన్పుట్ సమాచారం మేరకు డబ్ల్యూ సిసిబి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జల్లెడపట్టి ముగ్గురు వ్యక్తులను వారితో ఉన్న చిరుతపులి చర్మం, ఒక మోటార్ బైక్ ను పట్టుకున్నారు. 

ముగ్గురిని అరెస్టు చేసి గోప్యంగా రహస్య విచారణ చేయగా మరో ముగ్గురు అనుమానితుల ఆచూకీ కొరకు విచారణ జరుగుతున్నట్లు వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తుల పేర్లు

నిందితులు

1. జెండా నాగరాజు -సుండిపెంట

2. జెండా సునీల్ - దోర్నాల

3.రావెల్ల సురేష్ - సుండిపెంట. వీరితో పాటు మరో ముగ్గురు అనుమానితుల నిందితులు ఉన్నారని అసిస్టెంట్ ఫీల్డ్ విగ్నేష్ తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: