ఢిల్లీ ట్రాక్టర్ల ర్యాలీ కుసంఘీభావం ....
హిందూపురం ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతం చేయండి
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ఈ నెల 26నఢిల్లీలో జరిగే ట్రాక్టర్ పెరేడ్ కు సంఘీభావం గా హిందూపురంలో దాదాపు 100ట్రాక్టర్లతో రైతులు ప్రజాసంఘాలు పాల్గొని ఢిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు రైతు ప్రజా సంఘాల కన్వీనర్ చైతన్య గంగిరెడ్డి తెలిపారు. ఢిల్లీ లో సుదీర్ఘ రైతాంగ పోరాటానికి మద్దతుగా నూతన రైతు వ్యతిరేక వ్యవసాయ నల్లచట్టాలను రద్దు పరచాలని కోరుతూ వ్యవసాయ రైతు , అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో రహమత్ పురం ముస్లిం నగారా కార్యాలయంనందు విలేకరుల సమావేశం జరిగింది. రైతు ప్రజాసంఘాల కన్వీనర్ చైతన్య గంగిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమము జరిగింది.
26నఢిల్లీలో జరిగే ట్రాక్టర్ పెరేడ్ కు సంఘీభావం గా హిందూపురంలో దాదాపు 100ట్రాక్టర్లతో రైతులు ప్రజాసంఘాలు పాల్గొంటాయని ఢిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపే కార్యక్రమము కూడా ఉందని అన్నారు. హిందూపురం లో 26వతేదీ సూగూరు ఆంజనేయస్వామి దేవాలయం మహనీయుల విగ్రహాలను పూలమాలవేసి ట్రాక్టర్ల ర్యాలీ పట్టణ పురవీధుల గూండా తెలుగు తల్లి విగ్రహం వరకు జరిగే రైతు సంఘీభావర్యాలీలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని రైతు ప్రజా సంఘాల కన్వీనర్ చైతన్య గంగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అవాజ్ రాష్ట్ర నాయకులు ఇంతియాజ్. ఉదయ్ కుమార్.ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్.ఆర్సీపీ నాయకులు శ్రీనివాసులు కాంగ్రెస్ నాయకులు .జమీల్. బీఎస్పీ నాయకులు హనుమంతు. సీపీఎం నాయకులు. కార్మిక నాయకులు.రైతు సంఘం సిద్దారెడ్డి.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న. వ్యవసాయ రైతులు తెలుగుదేశం నాయకులు డీ ఈ.రమేష్. అమర్.ఎరుకల హక్కుల సంఘం శంకర్ దాదు.తదితరులు పాల్గొన్నారు 26వతేదీన రైతు పచ్చ కండువా పచ్చ జెండా జాతీయ జెండా లతో కార్యక్రమం సాగుతోందని నిర్వాహకులు తెలిపారు.
Post A Comment:
0 comments: