జిల్లా అభివృద్ధిలో కలెక్టర్, ఎస్పీల పాత్ర మరువలేనివి

వారు దళిత, గిరిజన బహుజనల ఆశాజ్యోతులు

వారి విద్య, జీవిత విధానం చరిత్ర పేదలకు విద్యార్థులకు ఒక ఆదర్శం

కలెక్టర్, ఎస్పీలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

కలెక్టర్, ఎస్పీ సేవలకు రాష్ట్ర ఉన్నత స్థాయి అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి

వీరు చేసిన అభివృద్ధి పై ప్రచారం నిర్వహిస్తాం

రాయలసీమ విద్యార్ధి, యువజన సంఘాల జేఏసీ నేత రామినేని రాజునాయుడు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పి ఫకీరప్ప ల  చిత్ర పటాలకు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి , యువజన సంఘాల నేతలు రామినేని రాజునాయుడు, వేణు మాధవ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో ఉండి భారత దేశములో కరోనా కేసులు ఎక్కువ నమోదు అయిన రోజుల్లో జిల్లా కలెక్టర్ వీర పాండియాన్, ఎస్ పి ఫకీరప్ప తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనాను కట్టడి చేసి డాక్టర్ల సహాయంతో లక్షల ప్రాణాలు కాపాడారు.
అదేవిధంగా వేధవతి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి, కర్నూలు ఎయిర్ పోర్టులో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయించి ప్రారంభానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలుకి హైకోర్టు ఏర్పాటుకు అనుకూల రిపోర్టులు రాష్ట్ర ప్రభుత్వంనకు నివేదికలు పంపారు అదేవిధంగా నంద్యాల ,అధోనికి వైద్య కళాశాలలు రావడానికి కృషి చేశారు. జిల్లా ఎస్ పి నేతృత్వంలో కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు కాపాడారన్నారు. జిల్లా ఎస్పీ,  జిల్లా కలెక్టర్ కార్యాలాయాలకు పరిమితము కాకుండా ఎక్కడ ఎలాంటి  ఆవాంచనియ సంఘటన జరగకుండా వేనువెంటనే స్పందిస్తూ బాధితులకు అండగా ఉండి భరోసా ఇస్తూన్నారన్నారు. అతి పేదరికం నుంచి పాఠశాల, ఉన్నత విద్యను చదివి అత్యున్నత స్థాయి ఐఎఎస్ , ఐపీఎస్ లు అయినా కలెక్టర్ వీర పాండియన్, ఎస్ పి ఫకీరప్ప జీవితాలు ఆదర్శం అని వారి యొక్క జీవిత చరిత్రను విద్యార్థులు, యువతకు తెలియజేసి అనేకమంది వీర పాండియన్, ఫకీరప్పలను  తయారు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అధికారులను దూషించడం దారుణం అని వెంటనే ఆ వాక్యలు చేసిన వ్యక్తులు వెనక్కి తీసుకొని ఇద్దరికి క్షమాపణలు చెప్పాలని కోరారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: