భోగిమంటల్లో రైతు వ్యతిరేక చట్టాలను...

దగ్ధం చేసిన ప్రజా సంఘాలు

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో చైతన్య గంగిరెడ్డి అధ్యక్షతన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులు ప్రజలు రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఆమోదింపజేసిన రైతు వ్యతిరేక చట్టాల కాపీలను సంక్రాంతి భోగిమంటల్లో దగ్ధం చేశారు ముస్లిం నగారా &టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ


దాదాపు 40రోజులుగా దేశవ్యాప్తంగా లక్షలాది రైతులు దేశ రాజధాని ఢిల్లీ లో  కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆమోదించిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిరసన చేస్తూ దాదాపు 50మంది రైతులు చలికి తట్టుకోలేక నిరసన శిబిరాల్లో ప్రాణాలు కోల్పోయినా కార్పరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజావ్యతిరేక విధానాలతో రైతుల ఉసురు తీస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి కి నిరసనగా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలి అని నినదించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆవాజ్ నాయకులు ఇంతియాజ్ సిక్కు  రైతుసంఘం పల్వీoన్డర్ సింగ్.రైతు సంఘంవినోద్ కుమార్.బాలాజీ మనోహర్ కాంగ్రెస్ నాయకులు.దండోరా నాయకులు సతీష్ బీఎస్పీ శ్రీరాములు.హరీ.రైతు సంఘం సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: