జిల్లా అధికారులను దూషించిన వారిని అరెస్టు చేయాలి

ప్రభుత్వ వైద్యశాల ముందు స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిరసన కార్యక్రమం

ఏపీఎన్జీవో  సాయిబాబా, తాసిల్దార్ వెంకటేశ్వర్లు

 నల్ల బ్యాడ్జీలతో ఏపీఎన్జీవో సంఘము, రెవెన్యూ అధికారులు ధర్నా నిరసన

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ని కొంతమంది వ్యక్తులు కక్ష గట్టి తమ సొంత పనుల కోసం కలెక్టర్ ని దూషించినందుకు నిరసనగా సోమవారం పత్తికొండ ప్రభుత్వ వైద్యశాల ముందు, స్థానిక తహసిల్దార్ కార్యాలయం  జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మొదటిగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమం ఏపీ ఎన్జీవో ప్రెసిడెంట్ ఆస్పరి సాయిబాబా నిర్వహించి అనంతరం తాసిల్దార్ కార్యాలయం నందు పత్తికొండ తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేయడం జరిగింది.

నిరసనలో భాగంగా తాసిల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారులతో పని చేయించుకోవాలి కానీ దాడికి పాల్పడ్డ కూడదు   మండలము జిల్లాలో రెవెన్యూ అధికారులు మేము ఉన్నది ప్రజల సేవ కోసమే అని తాసిల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు . అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో  జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి నుండి తన ప్రాణాలు పణంగా పెట్టి  రెవిన్యూ కార్యాలయంలో ప్రజలకు సేవ చేస్తున్నా అది గుర్తించకుండా  మాకు ఎన్నో  టెన్షన్ లు బాధలు ఉన్న పనిచేస్తున్నాం మా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం ఆఫీసులోనే ఉంటున్నామని అన్నారు. ఇది ప్రజలు గుర్తించాలని అలాగే అధికారులపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే చట్టం ప్రకారం శిక్షించాలని పత్తికొండ తాసిల్దార్ వెంకటేశ్వర్లు ఏపీఎన్జీవో నాయకులు ఆస్పరి సాయిబాబా పాల్గొని దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు  .ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇలియాజ్ కర్నూల్ పత్తికొండ తాలూకా డాక్టర్ తమిళ్ మరియు ఆశావర్కర్లు, ఏపీ ఎన్జీవో నాయకులు రమణ, వీరేష్ ,నాగేంద్ర ,టీఎం డి హుస్సేన్ ,అల్లిపిరా ఆస్పత్రి సిబ్బంది దేవా ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు .

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: