అన్నదానంతో ఎంతో పుణ్యఫలం

వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉప్పు జగన్ ప్రసాద్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఆకలితో ఉన్నవారికి ఒక్కపూట ఆకలి తీర్చడం ఎంతో పుణ్యఫలమని నంద్యాల రూరల్ సీఐ మురళీమోహన్ రావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉప్పు జగన్ ప్రసాద్  తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఎస్సార్బీసీ కాలనీలోని పరివర్తన సెంటర్లో ఉన్నవారికి ఆదివారం ఎస్సీ సంఘం నాయకులు వాదం జంబులన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సీఐ మురళీమోహన్ రావు, జగన్ ప్రసాద్ లు మాట్లాడుతూ
  అన్నిదానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పదన్నారు. నేడు ఎంతో మంది పుట్టినరోజు, పెళ్లిరోజు  వేడుకల పేరుతో విలాసాలకు ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారు వారి పేరు మీద పేదలకు, ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చడం ఎంతో పుణ్య కార్యక్రమన్నారు. మనం ఎంత సంపాదించినా మిగిలేది మంచి పేరే అని, పేదల కోసం పాటు పడే గుణం కలిగిన వారు ఎప్పటికీ పేదల మనసుల్లో ఉంటారన్నారు. మనం చేసిన మంచి పనులే కలకాలం గుర్తుంటాయని అన్నారు. అన్నదానం చేసిన జంబులన్నను అతిధులు అభినందించారు. కార్యక్రమంలో తాలూకా ఎస్సై మురళీకృష్ణ, వైఎస్ నగర్ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ టీవీ రమణ, సీనియర్ నాయకులు పూల శీను, మాజీ కౌన్సిలర్ కన్నమ్మ, వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు దేవకీనందన్ (దేవా)  తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: