నంద్యాలలో ట్రాక్టర్ ర్యాలీ

నల్ల చట్టాలు రద్దు చేయకపోతే పార్లమెంట్ ముట్టడి చేస్తాం

ఎర్ర జెండాల హెచ్చరి


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

దేశవ్యాప్తంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో చేస్తున్న రైతులకు పోరాటానికి మద్దతుగా మంగళవారం నంద్యాలలో నూనెపల్లి బ్రిడ్జి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నంద్యాల నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి సోమన్న, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి షరీఫ్ భాష, ఎఐటియుసి  అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు,
బాల వెంకట్, మహిళ సమాఖ్య డివిజన్ నాయకురాలు మహేశ్వరమ్మ, గోస్పాడు, మహానంది మండల సీపీఐ కార్యదర్శులు చెన్నయ్య, సామెయేలు, ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఎఐఎస్ఎఫ్-వైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సురేష్, వాసు, విష్ణు, సురేష్, మహానంది మండల కార్యదర్శి రవి, రుద్రవరం మండల నాయకుడు బాలాజీ రైతు, మహిళ, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: