కర్ణాటక నుంచి అక్రమ మద్యం

పట్టుకొన్న పత్తికొండ పోలీసులు

కారు సీజ్...ఇద్దరు అరెస్ట్

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

కర్ణాటక నుంచి ఏపీకి తరలివస్తున్న అక్రమ మధ్యాన్ని పత్తికొండలో ఎస్ఇబీ పోలీసు అధికార్లు పట్టుకొన్నారు. బుధవారం ఉదయం ఎస్ఇబీ సీఐ, ఎస్, సిబ్బంది తో కలసి దేవనకొండ మండలం గుమ్మలరాళ్ల క్రాస్ వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్న కార్ ను అందులోని 20 బాక్స్ ల ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ ను సీజ్ చేశారు.
ఈ ఘటనలో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. బుధవారం నాడు ఉదయం 8 గంటలకు బి. అగ్రహారం వద్ద ఇంకో కార్ ను అందులో 8 బాక్స్ ల మద్యం ను సీజ్ చేయటం జరిగింది. మొత్తం 2688 టెట్రా ప్యాకెట్స్ ను సీజ్ చేయటం జరిగింది. ఈ దాడుల్లో ఎస్.ఐ లు రాజశేఖర్, జనార్దన్ గౌడ్,మసిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయాన్ని పత్తికొండ ఇన్ స్పెక్టర్ ఎం.మంజూలా తెలిపారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: