నాంపల్లి కోర్టు లో కరోనా కలకలం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో కరోనా కలకలం కొనసాగుతోంది. కోర్టు సెక్షన్ గదులను శానితైజ్ చేసి శుభ్రం చేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కోర్టు బెంచ్ క్లర్క్ కు, అదే కోర్టుకు చెందిన గుమాస్తాలకు కరోనా టెస్ట్ చేసుకోమని వైద్యులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.  Vii అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పనిచేస్తున్న సెక్షన్ సిబ్బంది ఒకరికి కూడా వైద్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం నాడు కోర్టు సెక్షన్ గదులను షానిటై జ్ చేసి పరిశుభ్రం చేశారు.  కరోనా టెస్ట్ రిపోర్ట్ ప్రకారం వారు చికిత్స పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ముగ్గురు సిబ్బంది కోర్టుకు హాజరు కావడం లేదు. చికిత్స నిమిత్తం సెలవు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించినా కూడా సిబ్బందికి వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కోర్టులు ప్రారంభం కానప్పటికీ కరోనా ప్రభావానికి గురి అవుతున్నారు. ఇలాంటి సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు అధికారులు  నిర్ణయించారు.  ఇతరులకు ప్రబలకుండా ఉండేందుకు గదులలో కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు. కోర్టు సిబ్బంది సైతం కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

✍️రిపోర్టింగ్ -డి.అనంత రఘు

అడ్వకేట్-హైదరాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: