కలియుగ సరస్వతి సావిత్రిభాయి పూలే

ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

చదువులతల్లి సావిత్రి భాయి పూలె జయంతిని పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో ఆదివారం సావిత్రి భాయి పూలే చిత్రాన్ని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. మాట్లాడుతూ మూఢనమ్మకాల అజ్ఞానందకారంలో కొట్టుమిట్టాడుతున్న అట్టడుగు వర్గాల దుస్థితిని ఎండగట్టాలనే సంకల్పంతో చదువనేర్చుకొని కలియుగ సరస్వతీ అక్షరజ్యోతి చదువుల తల్లి సావిత్రి భాయి పూలె దీనులకు ముఖ్యంగా మహిళలకు చదువు నేర్పిన ఉపాధ్యాయురాలు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు సముచిత స్థానం ఉండాలని, ఉండాలంటే చదువే ఏకైక మార్గమని భర్త మహాత్మా జ్యోతిరావు పూలే సూచనలు అండదండలతో పాఠశాలలు స్థాపించి మూఢనమ్మకాలను ప్రక్షాళన గావించారు.
యువత వారి అడుగుజాడలలో నడచి అందరికి మార్గదర్శకులు కావాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు.కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరుప్య చిత్రకారుడు నహీంరుస్తుం నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, మెహరాజ్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: