యాళ్లురు గ్రామంలో పండుగల...
జగనన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం
పేదవాని సొంతింటి కల నెరవేర్చిన సీఎం
ఇళ్ల పట్టాల పంపిణీ చారిత్రాత్మకం
ఇంటి పట్టాల పంపిణీలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్
నంద్యాల ఎమ్మెల్యే శిల్సా రవిచంద్ర కిషోర్ రెడ్డి
నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదవాని సొంత ఇంటి కలను నెరవేర్చరని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు అన్నారు. బుధవారం సాయంత్రం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో నంద్యాల నియోజవర్గం, గోస్పాడు మండలం, యాళ్లురు గ్రామంలోని లే అవుట్ లో 238 మంది మహిళ లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ జగనన్న లేఔట్ లో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ
పేద వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చాలని గొప్ప ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో 2,07,490 లక్షల మంది నిరుపేద మహిళా లబ్ధిదారుల స్వంత ఇంటికల నెరవేరింది. ఇందులో 1,61,237 మందికి ఇంటి పట్టాల రూపంలో అందించమన్నారు. అలాగే 29,066 టిడ్కో ఇళ్లను, 17,187 పొజిషన్ సర్టిఫికెట్ లను ఇచ్చామన్నారు. ఇందులో ప్రభుత్వ భూమి మొత్తం ఎకరాలు 2966.19, భూమి కొనుగోలు కింద ఎకరాలు 1026.38 కొనుగోలు చేశామన్నారు.
ప్రభుత్వ మరియు భూసేకరణ భూమి మొత్తం 3992.57 ఎకరాలు ఉండగా అందులో భూసేకరణ భూమి కోసం 160.50 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రభుత్వ భూమి కోసం 661.89 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రభుత్వ మరియు భూసేకరణ భూమి కోసం మొత్తం 882 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో 4000ల ఎకరాల భూమిలో 1008 జగనన్న లే ఔట్స్ లలో 1.61 లక్షల మంది నిరుపేదలకు ఇంటి పట్టాలను ఇస్తున్నమన్నారు. ఒక ఇల్లు కట్టడానికి లక్షా ఎనభై వేల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగిందన్నారు. మొదటి విడతలో దాదాపు 98 వేల జగనన్న ఇళ్లను ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇల్లు కట్టడానికి మొదటి విడతలో 1770 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు.
మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇంటి నిర్మాణాలకు 3030.98 కోట్లు కేటాయిస్తున్నారు. కర్నూలు జిల్లాకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద సుమారు మొత్తం రూ.5668 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి కృషి చేసిన రెవెన్యూ, సచివాలయ అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో మహిళలు పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర పేద ప్రజల కష్టాలను స్వయంగా చూసి నవరత్నాల పథకాలను ప్రవేశ పెట్టి ఇల్లు లేని నిరుపేదలు అందరికీ సొంత ఇల్లు కల నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నారు.
పాఠశాలకు పంపే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాకు రెండో విడత 15,000 రూపాయలు జమ చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక పుస్తకాలు, బెల్టు, షూస్ ఇచ్చారన్నారు. చెప్పిన విధంగా చెప్పిన టైం లో అన్ని సంక్షేమ పథకాలు నెరవేరుస్తున్నారు. పొదుపు సంఘాల మహిళల కోసం రుణమాఫీ మొదటి విడత కింద 120 కోట్ల రూపాయలు నంద్యాల నియోజకవర్గంలో మాఫీ చేశారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 95 శాతం సంక్షేమ పథకాలన్నీ ఇప్పటికే అమలుపరిచారన్నారు. ఐదు కోట్ల రూపాయలతో యాళ్లురు గ్రామంలో 30 పడకల ఆసుపత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు.
రోడ్లు, కాలువలు కోసం కోటి రూపాయలు కేటాయించడం జరుగుతుంది అన్నారు. మన పిల్లల చదువుకోసం నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ తరహాలో అన్ని వసతులు కల్పిస్తున్నారు. 90 రోజుల లోపల ఇండ్ల పట్టాలు రాని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే వారందరికీ ఇంటి పట్టాలు మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. పట్టాల పంపిణీలో తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సుగుణ శ్రీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాష, మండల అధికారులు, మండల, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: