టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

జూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్

రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్

(జానోజాగో వెబ్ న్యూస్-ఆస్పరి ప్రతినిధి)

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, టమోటా పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం తక్షణమే టమోటా రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోనే బిల్లేకల్లు గ్రామంలోనే టమోటా మార్కెట్ ఆవరణంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం జగన్ మోహన్ బాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ ఆదోని డివిజన్ ప్రాంతంలో టమోటా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే టమోటా జ్యూస్‌ కర్మాగారం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఆ హామీ ఏమైందని విమర్శించారు.
ప్రస్తుత పరిస్థితులలో టమోటా కిలో ఒక్క రూపాయికి కూడా అమ్ముకునే పరిస్థితి రైతులకు లేదని, కూలీల డబ్బులు కూడా చేతికి రాని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటా రైతులు ధరల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతులను కలిసి పరామర్శించిన పాపాన పోలేదన్నారు. గతంలో ఉల్లి రైతులకు సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు ధరలు కూడా కల్పించాలన్నారు. రైతుల కంట కన్నీరు ప్రభుత్వానికి, దేశానికి మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధితో టమోటా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నం పెట్టే రైతన్న కు కన్నీటి సోకం కలిగిస్తే పుట్టగతులు ఉండవు అన్నారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, టిడిపి జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ మలకన్న, మాజీ సర్పంచ్ లు లోకేష్, ఉచ్చిరప్ప, విజయభాస్కర్, మల్లికార్జున గౌడ్, రాజశేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: