ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి మద్దతు...

ఆవాజ్ కమిటీ నిరాహార దీక్షలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రతిఘటిస్తూ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేసిన రైతాంగ పోరాటానికి మద్దతుగా ఆవాజ్ తూర్పు జిల్లా కమిటీ నంద్యాల ఆధ్వర్యంలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు జిల్లా కన్వీనర్ మస్తాన్వలి తెలిపారు. ఈ కార్యక్రమం ఆవాజ్ పట్టణ అధ్యక్షులు బాబుల్ల అధ్యక్షతన ప్రారంభమైనది. ఈ దీక్షలను రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్ ప్రారంభించినారు.

ఈ దీక్షలలో కూర్చున్నవారు ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఎస్.మస్తాన్ వలి, ఆవాజ్ నాయకులు డి.హుస్సేన్ భాష, హఫీజ్ ఖాజా, హఫీజ్ హుస్సేఫా, కమాల్ తదితరులు కుర్చున్నారు. ఈ దీక్షలకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సద్దాం హుస్సేన్, సిఐటియు నాయకులు గౌస్, రైతు సంఘం నాయకులు పుల్లా నరసింహ, ఐయూఎంఎల్ నాయకులు మౌలానా అబ్దుల్ సలాం తదితరులు మద్దతు తెలిపినారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతు అలాంటి రైతులను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డు పాలు చేసిందని అన్నారు కేంద్ర కేంద్ర ప్రభుత్వం బిజెపి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చి రైతులను నట్టేట ముంచింది అన్నారు ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని ఢిల్లీలో గత యాభై రోజుల నుండి రైతులు పోరాటాలు కేతు 80 మందికి పైగా రైతుల ప్రాణాలు పోయినా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు 50 రోజుల నుండి రైతులు చేసిన పోరాటాన్ని పట్టించుకోకుండా, నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సీన్ ప్రచారం చేస్తూ రైతులు చేస్తున్న పోరాటాలను కూడా చూసి చూడనట్లు  వ్యవహరిస్తోందని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: