పన్నుల బారా లపై ప్రతి ఒక్కరు ఉద్యమించాలి

పట్టణ పౌర సమైక్య పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

నందికొట్కూర్, మున్సిపల్ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పట్టణ పౌర సమైక్య నాయకులు ఎం నాగేశ్వరరావు కె భాస్కర్ రెడ్డి  పిలుపునిచ్చారు, కేంద్రం ఇచ్చే 2500 కోట్లు ఇచ్చే అప్పు కోసం ఆస్తి పన్నుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చీకటి చట్టాలను తీసుకు వచ్చిందని వీటికి వ్యతిరేకంగా మంగళవారం పట్టణ పౌర సమైక్య ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ధర్నా కార్యక్రమానికి పట్టణ పౌర సమాఖ్య నాయకులు పి పకీర్ సాహెబ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఎం నాగేశ్వరరావు కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ , కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు అండగా నిలిచి సంక్షేమ ఫలాలు అందించాల్సిన ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం వేసే ప్రయత్నం సరికాదని వారు వివరించారు, త్రాగునీరు, చెత్త, ఆస్తి పన్నులు పెంచేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 196, 197, 198, రద్దు చేయాలని డిమాండ్ చేశారు, పట్టణాలనుంచి గ్రామాలకు ప్రజలు వలసలు వెళుతున్న పరిస్థితులు తలెత్తి అన్నారు, ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచి మరింత భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారు, ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలన్నారు, తక్షణమే 196 197 198 జీవోలను రద్దు చేయకపోతే పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు, అనంతరం వినతి పత్రాన్ని మున్సిపల్ మేనేజర్ బేబీకి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, మద్దిలేటి, సాజిదా బి, రజిత , సుంకన్న, బాలస్వామి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: