మానవీయ విలువలను పెంపొందించుకోవాలి

శారాజి పేట సహకార సంఘం అధ్యక్షుడు పెండ్యాల శ్రీరాములు

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

సమాజం కలకాలం పరిడవిల్లలంటే, ప్రతి ఒక్కరూ మానవీయ విలువలను పెంపొందించుకోవాలని శరాజిపేట సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెండ్యాల శ్రీరాములు, మొహమ్మద్ గౌస్ పిలుపునిచ్చారు . ఆదివారం మండలం లోని షారాజి పేట లో జరిగిన ఆ సంఘం వార్షకోత్సవ సభలో వారు మాట్లాడారు.
కొరోన మహమ్మారి మానవ జాతిని అతలాకుతలం చేసినా, మానవత్వం తో ఒకరినొకరు సహకరించు కోవడమే నిజమైన మానవత్వం అన్నారు. ప్రేమానురాగాల తో, సోదరభావంతో, ఒకే కుటుంబ సభ్యులు గా మెలగాలన్నారు.గ్రామ ప్రగతి లో  భాగస్వామ్యులు కావాలన్నారు.ఈ సమావేశం లో కృష్ణారెడ్డి,దేవేందర్,సత్యనారాయణ,కుర్షిద్ పాషా, రామకృష్ణ,వీరాస్వామి శ్రీనివాస్,రమేష్, రామ్ మనోహర్, కొమురయ్య, రాములు తదితరులున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: