యువత మానవతా విలువల పెంపుకు కృషి చేయాలి

రాష్ట్ర మానవహక్కుల కమిష నర్ జస్టిస్ గుండా చంద్రయ్య

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

యువత మానవతా విలువల పెంపుకు కృషి చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. శనివారం ఆయన యాదగిరి గుట్ట కు రాగా,తెలంగాణ ఆర్టీఐ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఖుర్షీద్ పాషా, దీన శరణ్య సంస్థ అధ్యక్షుడు చింతల సాయిబాబా లు గౌరవ పూర్వకంగా కలిసి, సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నా మన్నారు.
జస్టిస్ గుండా చంద్రయ్య ను గౌరవ పూర్వకంగా కలిసిన దీనసరణ్య సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా,ఆర్టీఐ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు,ప్రేమ సేవా సదనం డైరెక్టర్ మొహమ్మద్ కుర్శీద్ పాషా
యువత దేవాలయాలను, విద్యాలయాలను, వైద్యాలయాలను, గ్రంధాలయాలను పవిత్రంగా భావించి, ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి మార్గాలు వేయాలన్నారు.మానవ హక్కుల కు భంగం కలిగించే అం శాలు,తమ దృష్టికి వస్తే, అవసరమైతే సుమోటోగా స్వీకరించి,కేసులను నమోదు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీహరి,వెంకట్,మోహన్,రాజు తదితరులున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: