స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సీపీఐ అభ్యర్థులు

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ రసూల్

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ రసూల్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సీపీఐ అభ్యర్థులు పాల్గొంటారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ రసూల్ పేర్కొన్నారు. గోస్పాడు, సిరివేళ్ళ, మహానంది, రుద్రవరం మండలాల్లో వివిధ గ్రామాల్లో సీపీఐ అభ్యర్థులు సర్పంచ్  అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని, ఆ అభ్యర్థుల వివరాలను స్థానిక నంద్యాల సీపీఐ కార్యాలయంలో జరిగిన సీపీఐ నంద్యాల డివిజన్ స్థాయి ముఖ్యనాయకుల సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ రసూల్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల సమస్యల పరిస్కారం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జరుగుతున్న అవమానాలు, అసమానతలను రూపుమాపడనికి అను నిత్యం కృషి చేస్తూ, ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సీపీఐ జెండా ఉంటుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేందుకు నడుం బిగించి, గ్రామీణ ప్రాంతలల్లో పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రజలను బానిసలుగా చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి నిత్యం ప్రజా ప్రయోజనాలకోసం తమ జీవితాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న సీపీఐ అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ముందుకు వస్తున్నారని,  కావున ప్రజలందరు కూడా ఆలోచన చేసి అబివృద్ధిని దోచుకునే నాయకులను కాకుండా అబివృద్ధిని కాంక్షించే సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాబా ఫక్రుద్దీన్, నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్, ఎఐవైఎఫ్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, ఎఐకెఎస్, బికెఎంయు నంద్యాల డివిజన్ కార్యదర్శులు సోమన్న, సుబ్బారాయుడు, ఎఐటియుసి నంద్యాల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, బాలవెంకట్,ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్, ఎఐఎస్ఎఫ్-వైఎఫ్  నంద్యాల అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, విష్ణు, సురేష్, వాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు హరికృష్ణ, మహానంది మండల కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: